Rambha: భర్తతో విడాకులు.. సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ స్టార్ నటి!

by sudharani |   ( Updated:2024-10-25 15:04:36.0  )
Rambha: భర్తతో విడాకులు.. సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ స్టార్ నటి!
X

దిశ, సినిమా: సీనియర్ నటి రంభ (Rambha) అందరికి గుర్తుండే ఉంటోంది. ఒకప్పుడు ఇండస్ట్రీ (Industry)లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన ఈ బ్యూటీకి కుర్రాళ్లు సైతం ఫిదా అయ్యేవారు. అంతటి క్రేజ్ (Crazy) ఉన్న రంభ.. తెలుగుతో పాటు తమిళ్ (Tamil), హిందీ (Hindi)లో కూడా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్‌గానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా చేసిన ఈమె.. 2010లో శ్రీలంక (SriLanka)కు చెందిన వ్యాపారవేత్త (businessman)ను వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ తన వ్యక్తి గత కారణాల చేత తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అయితే.. రంభ వైవాహిక జీవితం (married life)లో విభేదాలు వచ్చాయని, ఆమె తన భర్తతో విడిపోనుందని గత కొంత కాలంగా వార్తలు వైరల్ (viral) అవుతున్నాయి. అలాగే.. తన భర్తకు విడాకులు (divorce) ఇచ్చి త్వరలోనే ఇండియా (India) వచ్చేందుకు సిద్ధం అవుతుందట ఈ నటి. అంతే కాకుండా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings) స్టార్ట్ చేసే పనిలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో తన విడాకుల రూమర్స్ (Rumors)పై స్పందించిన రంభ ‘వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయి. కానీ అవి చిన్నపాటి మనస్పర్థలు మాత్రమే. అన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది’ అని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ గొడవలే ఎక్కువ కావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా (Social Media)లో మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ప్రజెంట్ రంభ సినిమాల్లో నటించనప్పటికీ.. తమిళ్, తెలుగు‌లో పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. రంభ సెకండ్ ఇన్నింగ్స్ అండ్ విడాకుల ఇష్యూ (issue)లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed