OPPO A3x 4G: ఒప్పో నుంచి కొత్త ఫోన్ విడుదల.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్

by Maddikunta Saikiran |
OPPO A3x 4G: ఒప్పో నుంచి కొత్త ఫోన్ విడుదల.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్
X

దిశ, వెబ్ డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో(OPPO) ఇండియన్ మార్కెట్ లోకి తక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో A3x (OPPO A3x) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో OPPO A3x 5G మొబైల్ ను విడుదల చేసిన ఒప్పో తాజాగా అదే పేరుతో 4G ఫోన్‌ను ఆవిష్కరించింది. OPPO A3x 4GB/64GB మోడల్‌ ధరను రూ. 8,999, 4GB/128GB వేరియంట్‌ ధరను రూ. 9,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ఫోన్ ఓషన్ బ్లూ (Ocean Blue), నెబ్యులా రెడ్(Nebula Red) కలర్స్‌లో లభిస్తోంది. అక్టోబర్ 29 నుండి ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

OPPO A3x 4G స్పెసిఫికేషన్స్..

  • 6.67 అంగుళాల HD డిస్‌ప్లే
  • Qualcomm Snapdragon 6s 4G Gen 1 చిప్‌సెట్ పై పని చేస్తుంది.
  • 4జీబీ ర్యామ్ +64/128జీబీ రోమ్ (4GB RAM+64/128GB ROM)
  • 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ (90Hz Refresh Rate)
  • ఆండ్రాయడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • బ్యాక్ సైడ్ 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫ్లికర్ సెన్సార్ తో వస్తోంది.
  • సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5100mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Advertisement

Next Story

Most Viewed