SBI 'డోర్‌స్టెప్'లో లభించే సేవలు ఇవే..

by Harish |   ( Updated:2022-08-17 15:31:18.0  )
SBI డోర్‌స్టెప్లో లభించే సేవలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన వినియోగదారులకు ఇటీవల కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. తన ఖాతాదారులకు నెలకు మూడు సార్లు ఉచితంగా 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. వివిధ కారణాల వలన బ్యాంకులకు రాలేక పోతున్న వారికోసం ఈ సేవలను తెచ్చింది. ముఖ్యంగా వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, వికలాంగులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.

'డోర్‌స్టెప్ బ్యాంకింగ్' సేవల కోసం హోమ్ బ్రాంచ్‌లో మాత్రమే సంప్రదించాలి. క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ రోజుకు 20,000 రూపాయల లిమిట్ ఉంది. వికలాంగులకు నెలలో 3 ఉచిత సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతా ఖాతాదారులకు ఆర్థికేతర లావాదేవీలకు సేవా ఛార్జ్ రూ. 60/+GST. ఆర్థిక లావాదేవీలకు రూ. 100+GST ఉంటుంది. హోమ్ బ్రాంచ్ 5 కి.మీ పరిధిలో నివసిస్తున్న కస్టమర్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి ఇలా చేయండి

- ముందుగా బ్యాంక్ వినియోగదారులు SBI Yono యాప్‌ని ఓపెన్ చేయాలి.

- మెను ఆప్షన్ నుండి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఎంచుకోవాలి.

* SBI డోర్‌స్టెప్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ టోల్ ఫ్రీ నంబర్‌లు 1800 1037 188 లేదా 1800 1213 721.

SBI అందించే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు

1. క్యాష్ పికప్

2. క్యాష్ డెలివరీ

3. చెక్ పిక్ అప్

4. చెక్ స్లిప్ పికప్‌

5. ఫారం 15H పికప్

6. డ్రాఫ్ట్‌ల డెలివరీ

7. టర్మ్ డిపాజిట్ సలహా డెలివరీ

8. లైఫ్ సర్టిఫికెట్

9. KYC పత్రాలు

Advertisement

Next Story

Most Viewed