- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..? ఇవే జరిగే నష్టాలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్-ఆధార్ లింక్ గురించే చర్చ నడుస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ పాన్ నెంబర్‌ను ఆధార్ సంఖ్యతో లింక్ చేసుకోవాలని గత కొంత కాలంగా ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా పాన్-ఆధార్ లింక్ చివరి తేదీని పొడిగించిన కేంద్రం. మార్చి 31 చివరి తేదీగా ఇటీవల పేర్కొన్నప్పటికీ మళ్లీ దాన్ని జూన్ 30, 2023 కు పెంచింది. ఈ తేదీలోపు రూ.1000 చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు.
అయితే చాలా మంది ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకపోతే ఏం కాదులే అని అనుకుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం, ఆధార్‌తో పాన్ లింక్ లేకుంటే లావాదేవీల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం..
* బ్యాంకులలో లేదా ఏదైనా సంస్థలలో రూ.50,000 మించి ఎక్కువ డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయలేరు.
* రూ.50,000 లోపు మాత్రమే అమౌంట్‌ను విత్‌డ్రా చేయగలరు.
* ట్యాక్స్ మినహాయింపు నిబంధనలు వర్తించవు. దీంతో ట్యాక్స్ రీఫండ్లు ఆగిపోతాయి.
* పాన్ కార్డు పని చేయకుండా పోయిన రోజు నుంచి ఎలాంటి వడ్డీ పొందలేరు.
* వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం కుదరదు.
* స్టాక్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఎలాంటి లావాదేవీలు జరపలేరు.
* TDS ఎక్కువగా కట్ అవుతుంది
* కార్డు పనిచేయకపోవడంతో ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి: