టెలికాం కంపెనీల మొత్తం అప్పు ఎంతంటే!

by Harish |
టెలికాం కంపెనీల మొత్తం అప్పు ఎంతంటే!
X

న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం కంపెనీల మొత్తం అప్పు రూ. 4.17 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం పార్లమెంట్ లో తెలిపింది. ఈ మేరకు టెలికాం శాఖ సహాయమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో పాటు ఆరు టెలికాం కంపెనీల రుణాల వివరాలను తెలియజేశారు. మొత్తం అప్పుల్లో ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు అత్యధికంగా రూ. 1,91,073.9 కోట్లు, ఎయిర్‌టెల్‌కు రూ. 1,03,408.1 కోట్లు), రిలయన్స్ జియోకు రూ. 42,486 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 40,400.13 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ రూ. 20,162.04 కోట్లు, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర) రూ. 19,70.3.84 కోట్ల అప్పులున్నాయి.

దేశీయ టెలికాం పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు, లిక్విడిటీ సౌకర్యాన్ని పెంచేందుకు, పెట్టుబడుల ప్రోత్సాహానికి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నియంత్రణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలను తీసుకొచ్చిందని చౌహాన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed