గుండె అదిరేలా రూ.3700 దాటిన గ్యాస్ సిలిండర్ ధర!

by GSrikanth |
గుండె అదిరేలా రూ.3700 దాటిన గ్యాస్ సిలిండర్ ధర!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ప్రతీ నెల ఒకటవ తేదీన ఈ గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఈ గ్యాస్ ధరలు ఎప్పుడు భారంగానే మారుతుంటాయి. ప్రతినెలా వంట సామాన్‌ కోసం అని ప్రతీ ఇంట్లో కొంత అమౌంట్‌ను ఫిక్స్ చేసి పెట్టుకుంటుంటారు. ఇలాంటి తరుణంలో ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుండటంతో జనాలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ ధరలు వందల్లో ఉంటేనే తట్టుకోవడం కష్టమంటే ఓ చోట ఏకంగా వేలకు చేరింది. పాకిస్తాన్ ఏకంగా రూ.3 వేల మార్కును దాటింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కంపెనీ ఓగ్రా డొమెస్టిక్ సిలిండర్ ధరను కిలోకు రూ.246.15 చొప్పున పెంచింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర పాకిస్తాన్‌లో రూ.3,079.64 కు చేరింది.

Advertisement

Next Story