Nirmala Sitharaman : జూన్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

by Harish |   ( Updated:2024-06-13 08:43:59.0  )
Nirmala Sitharaman : జూన్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఆర్థికమంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడటానికి విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీయే మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి GST కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన తేదీలను విడుదల చేశారు. జూన్ 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. న్యూఢిల్లీలో ఈ మీటింగ్ జరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఒక ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

52వ కౌన్సిల్ సమావేశం అక్టోబర్ 7, 2023న జరగ్గా, ఇప్పుడు జరగబోయేది 53వ సమావేశం. చివరి సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, రెవెన్యూ కార్యదర్శి, చైర్మన్ సీబీఐసీ, జీఎస్టీ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పుడు జరగబోయే సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. రాబోయే సమావేశంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి పన్ను రేట్లు, విధాన మార్పులు, GST పాలనకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు.

Advertisement

Next Story