- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్యాక్స్ బకాయిలు చెల్లించడానికి ఇదే చివరి తేదీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ
దిశ, బిజినెస్ బ్యూరో: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు చెల్లించని వ్యక్తులు, సంస్థలను గుర్తించినట్లు ఆదివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను చెల్లింపులు చేయడంలో వారిని అలర్ట్ చేయడానికి ఈ-ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. పన్ను బకాయిలు ఉన్న వ్యక్తులు, సంస్థలకు SMSల ద్వారా ముందస్తు సమాచారాన్ని అందించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మార్చి 15 లేదా అంతకు ముందుగా బకాయి పడినటువంటి పన్నును జమ చేయాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజలు, సంస్థలకు పన్ను చెల్లింపు గురించిన ఆవశ్యకతను తెలియజేయడానికి, పారదర్శకతను పెంచడానికి, స్వచ్ఛంద చెల్లింపులు చేయడానికి వీలుగా ఈ-ప్రచారాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేసి 'రిజిస్టర్' బటన్‌ను క్లిక్ చేసి, సంబంధిత వివరాలను అందించాలని వారు తెలిపారు. పన్ను బకాయిలను నిర్ణీత సమయంలోపు చెల్లించడం ద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యల నుంచి బయటపడవచ్చని అధికారులు పేర్కొన్నారు.