- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
6 లక్షల టన్నుల కంది, మైసూర్ పప్పును రైతుల నుంచి సేకరించనున్న కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పప్పుల నిల్వలు పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇటీవల ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ప్రముఖ మీడియాతో పేర్కొన్న దాని ప్రకారం, 4,00,000 టన్నుల ముడి కంది పప్పు, 2,00,000 టన్నుల మైసూర్ పప్పును రైతుల నుంచి నేరుగా సేకరించడానికి కేంద్రం యోచిస్తోందని తెలిపారు. కనీస హామీ సేకరణ ధర (MAPP) ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పప్పుధాన్యాల తక్కువ ఉత్పత్తి కారణంగా ప్రభుత్వ బఫర్ స్టాక్‌లు పడిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
దీనిలో భాగంగా ఈ రెండు పప్పులను నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుండి సేకరిస్తాయని అధికారి అన్నారు. జనవరిలో ప్రారంభమైన ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా రైతులు పప్పును రెండు ప్రభుత్వ సేకరణ ఏజెన్సీలకు NAFED, NCCFకి విక్రయించవచ్చు. కనీస మద్దతు ధర ఆధారంగా పప్పులను కొనుగోలు చేస్తారని సంబంధిత అధికారి తెలిపారు. గత ఏడాది సీజన్‌లో వాతావరణ అవాంతరాల కారణంగా ఉత్పత్తి పడిపోవడంతో పప్పుల ధర గణనీయంగా పెరిగింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జనవరిలో 19.5 శాతం నుండి ఫిబ్రవరిలో 18.9 శాతానికి తగ్గింది.