- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక అసెస్‌మెంట్ ఏడాదికి ఒక అప్‌డేట్ రిటర్న్ మాత్రమే ఫైల్ చేయాలి: సీబీడీటీ చైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులు ఒక అసెస్‌మెంట్ ఏడాదికి ఒక అప్‌డేట్ రిటర్నులను మాత్రమే ఫైలింగ్ చేసేందుకు అనుమతి ఉందని ప్రభుత్వాధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధన ఉద్దేశ్యం పన్ను చెల్లింపుదారు రిటర్న్‌లను దాఖలు చేయడంలో పొరపాటు జరిగిన సమయంలో సహాయం కోసమేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) చైర్మన్ జే బి మహపాత్ర చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 2022-23 బడ్జెట్‌లో రిటర్నుల దాఖలులో లోపాలను సరిచేసేందుకు పన్ను చెల్లింపుదారులకు రెండేళ్ల వరకు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అప్‌డేట్ చేసిన ఐటీఆర్‌ను 12 నెలల్లోపు ఫైల్ చేస్తే బకాయి పన్ను, వడ్డీపై అదనంగా 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే 12 నెలల తర్వాత దాఖలు చేస్తే 50 శాతానికి పెరుగుతుందని, ఇది సంబంధిత అసెస్‌మెంట్ ఏడాదికి 24 నెలల్లోపు వర్తిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఒక నిర్దిష్ట అసెస్‌మెంట్ ఏడాదికి నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రక్రియను ప్రారంభిస్తే పన్ను చెల్లింపుదారులు ఆ నిర్దిష్ట ఏడాదిలో అప్‌డేట్ రిటర్నుల ప్రయోజనాలను పొందలేదు. అలాగే, పన్ను చెల్లింపుదారులు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను ఫైల్ చేసి అదనపు పన్ను చెల్లించకపోతే ఆ రిటర్న్ చెల్లదని మహపాత్ర వివరించారు.