Tax Payers: ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్.. ముందస్తు పన్ను చెల్లింపుకు నేడే లాస్ట్ డేట్..!

by Maddikunta Saikiran |
Tax Payers: ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్.. ముందస్తు పన్ను చెల్లింపుకు నేడే లాస్ట్ డేట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయపు పన్ను(Income Tax) చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. అసెస్మెంట్ ఇయర్ 2024-25కు సంబంధించి ముందస్తు పన్ను(Advance Tax) చెల్లింపు ఈ రోజు(డిసెంబర్ 15)తో ముగియనుంది. ఈ రోజు లోపు మూడో విడుత ముందస్తు పన్ను చెల్లించకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. రూ. 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ప్రతి ఏడాది జూన్ 15వ తేదీలోపు ట్యాక్సులో 15 శాతం మొదటి విడత కింద చెల్లించాలి. ఇక సెప్టెంబర్ 15లోపు 45 శాతం, డిసెంబర్ 15 నాటికి 75 శాతం, మార్చి 15 లోపు 100 శాతం ఇలా నాలుగు విడతల్లో ట్యాక్స్ కట్టేసి ఉండాలి. ఒక వేళ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకుండా లేట్ చేస్తే పెనాల్టీలు(Penalties) కట్టాల్సి వస్తుంది.

ముందస్తు పన్ను అంటే ఏంటి..?

ఆర్థిక సంవత్సరంలో రాబోయే ఆదాయాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వానికి ముందుస్తుగా పన్ను చెల్లించడాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. దీనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాబోయే ఆదాయంపై చెల్లించాల్సిన ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.10 వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న వారందరూ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు ప్రతి ఒక్కరు తమ ట్యాక్స్ రూ.10 వేలు దాటినట్లియితే విడతల వారిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఉద్యోగుల విషయంలో కంపెనీలు ట్యాక్స్ కట్ చేస్తాయి కాబట్టి వారు ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

Advertisement

Next Story

Most Viewed