- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపిన టాటా ప్లే
దిశ, బిజినెస్ బ్యూరో: టీవీతో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనూ వీక్షకులకు ప్రైమ్ ప్రయోజనాలను అందించడానికి టాటా ప్లే అమెజాన్ ప్రైమ్‌తో జతకట్టింది. టాటా ప్లే తన డీటీహెచ్, బింజ్ ప్యాక్‌లలో భాగంగా ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా వివిధ ప్యాక్‌లలో టీవీ ఛానెళ్లు, ప్రైమ్ వీడియో కంటెంట్ లైబ్రరీకి యాక్సెస్‌తో పాటు అమెజాన్‌లో ఆర్డర్లను అదే రోజు లేదా మరుసటి రోజే డెలివరీ అందుకోవచ్చు. ఈ భాగస్వామ్యంతో టాటా ప్లే డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లు నెలకు రూ. 199 నుంచి ప్రారంభమయ్యే ఏ ప్యాక్‌నైనా ఎంపిక చేసుకోవచ్చు. టీవీ ఛానెళ్లు, ప్రైమ్ లైట్ కంటెంట్ పొందవచ్చు. బింజ్ సబ్‌స్క్రైబర్లు ప్రైమ్ లైట్ మాత్రమే కాకుండా 30కి పైగా ఓటీటీ యాప్‌లు ఎంచుకునే వీలుంటుంది. ప్రైమ్ వీడితో పాటు ఆరు ఓటీటీల కోసం రూ. 199 చెల్లించాలి, అదే 33 యాప్‌లు కావాలనుకుంటే రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ప్లాన్‌లలో నచ్చిన ఓటీటీలను ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ సహకారం టాటా ప్లే కస్టమర్‌లకు వీడియో, ఆర్డర్లు, షాపింగ్ ప్రయోజనాలను అందించడానికి వీలవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇవికాకుండా టాటా ప్లే డీటీహెచ్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో రాయితీ పొందవచ్చని పేర్కొంది.