ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసిన టాటామోటార్స్!

by Javid Pasha |   ( Updated:2023-05-22 12:51:06.0  )
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసిన టాటామోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సోమవారం తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో సరికొత్త భద్రతా ఫీచర్లు అందించామని కంపెనీ తెలిపింది. ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీని మొత్తం ఆరు వేరియంట్లలో అందిస్తున్నామని, ధరలు రూ. 7.55 లక్షల నుంచి రూ. 10.55 లక్షల మధ్య ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొత్త వెర్షన్ ట్విన్-సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో వస్తుంది. ఈ సిలిండర్లు లగేజీ భాగం కింద అమర్చబడి ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 8-స్పీకర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లలో ప్రజలు సాంప్రదాయ ఇంధనానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ముఖ్యంగా కాలుష్య రహిత, మైలేజీ ఉన్న వాహనాలను ఇష్టపడుతున్నారని కంపెనీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా ప్రయోజనకరమైన సీఎన్‌జీ వెర్షన్‌లో వాహనాలను అందిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.

Also Read..

2000 నోట్ల రద్దు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story