బిజినెస్ ఐడియా: ATM ఫ్రాంచైజీతో నెలకు రూ. 70 వేల సంపాదన

by Harish |   ( Updated:2023-04-19 13:36:54.0  )
బిజినెస్ ఐడియా: ATM ఫ్రాంచైజీతో నెలకు రూ. 70 వేల సంపాదన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ప్రతినెలా ఇన్‌కమ్ సంపాదించుకోవాలనుకునే వారికి ఒక బిజినెస్ బాగా సెట్ అవుతుంది. అదే ఏటీఎం ఫ్రాంచైజ్. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ATM లు లేని ప్రదేశాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సొంతంగా కొన్ని ATM లను ఏర్పాటు చేస్తాయి. మరికొన్ని ATMలను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తాయి. ఇలా మీరు ఆ ఏటీఎంలను ఏర్పాటు చేసి దానిపై రాబడి పొందొచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్

ఏటీఎం ఫ్రాంచైజ్ తీసుకోడానికి దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో మొదట రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ క్యాపిటల్ కోసం రూ. 3 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి.

రాబడి

ఏటీఎం ఫ్రాంచైజ్ ద్వారా మొత్తం నెలకు రూ. 50 వేల నుంచి 70 వేల వరకు సంపాదించవచ్చు. కస్టమర్లు చేసే ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.8 వరకు కమిషన్ లభిస్తుంది. అలాగే బ్యాలెన్స్ చెక్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లకు ఒక్కోదానికి రూ.2 చొప్పున బ్యాంకులు చెల్లిస్తాయి.

ఏటీఎం ఫ్రాంచైజీ కోసం ఉండాల్సిన అర్హతలు

ఏటీఎం క్యాబిన్ ఏర్పాటు చేయడానికి, అనువుగా ఉండే గదిని ఎంచుకోవాలి. దాదాపు అది 50 నుంచి 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. దాంతో పాటు దాని చుట్టు ప్రక్కల మిగతా ATM సెంటర్లకు కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే, కరెంట్ సరఫరా నిరంతరాయంగా ఉండాలి. ఇంకా దాని చుట్టుపక్కల ఉండే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.

అప్లికేషన్ విధానం

ఏటీఎం ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్, ఫొటోలు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకుని సంబంధిత బ్యాంకులో సంప్రదించాలి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా టాటా ఇండి క్యాష్, ముథూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎంలు ప్రైవేటుగా ఏటీఎం ఫ్రాంచైజీలను తీసుకుని వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. మీరు కూడా ఈ విధంగా నెలకు రూ. 70 వేల వరకు రాబడి పొందొచ్చు. పూర్తి వివరాల కోసం బ్యాంకులలో సంప్రదించగలరు.

Also Read..

రూ. 33 లక్షల కోట్ల సేవల ఎగుమతులు!

Advertisement

Next Story

Most Viewed