Swiggy-Zomato: స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం.. త్వరలో కొత్త తరహా సేవలు ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Swiggy-Zomato: స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం.. త్వరలో కొత్త తరహా సేవలు ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy) త్వరలో మరిన్ని సేవలను అందుబాటలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే క్విక్ కామర్స్(Quick Commerce) రంగంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీలు తాజాగా.. కొత్త తరహా సర్వీసెస్(New services)ను ప్రారంభించడంపై ఫోకస్ చేసినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన స్విగ్గీ ‘యెల్లో(Yello)’ పేరుతో కొత్త పైలట్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనుందాని తెలిసింది. దీని ద్వారా లాయర్లు, థెరపిస్ట్‌లు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, జ్యోతిష్కులు, డైటీషియన్‌ల వంటి నిపుణులను ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావడానికి యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీన్ని ప్రత్యేక యాప్‌గా సేవలందించాలా..? ఇన్‌స్టామార్ట్ మాదిరిగానే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్‌లోనే కొనసాగించాలా అనే దానిపై ఇంకా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఇక గురుగ్రామ్‌(Gurugram)కు చెందిన జొమాటో వినియోగదారులకు వాట్సాప్‌(Whatsapp) ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌లు(Food Orders) చేసుకునే సదుపాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని తెలిసింది. దీని కోసం చాట్‌బాట్‌(Chatbot)లకు బదులుగా కస్టమర్ ఏజెంట్ల(Customer agents)ను జొమాటో నియమించనున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో పాటు తన క్విక్ కామర్స్ విభాగం బ్లింకిట్(Blinkit) యాప్ ద్వారా అర్బన్ కంపెనీ(Urban Company) తరహాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల వంటి హ్యాండిమెన్ సేవల కోసం కొత్త ప్లాట్‌ఫారమ్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story