Swiggy-Zomato: స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ.. వెల్‌కమ్ చెప్పిన జొమాటో

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-17 12:44:33.0  )
Swiggy-Zomato: స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ.. వెల్‌కమ్ చెప్పిన జొమాటో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి(NSE)లో 8 శాతం ప్రీమియంతో రూ. 420 వద్ద షేర్లు ప్రారంభం కాగా.. బాంబే స్టాక్ ఎక్స్చేంజి(BSE)లో 5.64 శాతం ప్రీమియంతో రూ. 412 వద్ద షేర్లు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన స్విగ్గీని దాని పోటీ సంస్థ జొమాటో(Zomato) స్వాగితిస్తూ ఓ ఫోటోను ఎక్స్(X)లో పోస్ట్ చేసింది. 'యూ అండ్ ఐ.. ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు స్విగ్గీ షేర్లు దలాల్ స్ట్రీట్ లో లిస్ట్ అవ్వడంపై జొమాటో సీఈఓ(Zomato CEO) దీపిందర్ గోయల్(Deepinder Goyal) కూడా అభినందనలు తెలిపారు. భారతదేశానికి కలిసి సేవ చేయడంలో ఇంతకంటే మెరుగైన కంపెనీని ఊహించలేం' అని అన్నారు. కాగా గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా స్విగ్గీ ఐపీఓ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.


👉 Click Here For Tweet!

Advertisement

Next Story