Swiggy Q2 Results: రెండో త్రైమాసికంలో రూ. 625 కోట్ల నష్టాలను ప్రకటించిన స్విగ్గీ..!

by Maddikunta Saikiran |
Swiggy Q2 Results: రెండో త్రైమాసికంలో రూ. 625 కోట్ల నష్టాలను ప్రకటించిన స్విగ్గీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Food Delivery) సంస్థ స్విగ్గీ(Swiggy) సెప్టెంబర్(September) తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను(Quater Results) విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(Q2FY25) సంస్థ రూ. 625 కోట్ల నికర నష్టాల(Net losses)ను ప్రకటించింది. కాగా గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 657 కోట్లతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా నష్టాలు తగ్గాయని పేర్కొంది. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం 30 శాతం పెరిగి రూ. 3601 కోట్లుగా నమోదైందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. 2023 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 2,763.3 కోట్లుగా ఉందని వెల్లడించింది. కాగా ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీతో పోటీ పడుతున్న జొమాటో(Zomato) రెండో త్రైమాసికంలో రూ. 272 కోట్ల లాభాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్ఎస్ఈ(NSE)లో సంస్థ షేర్ వాల్యూ(Share Value) 0.55 నష్టంతో రూ.491 వద్ద ముగిసింది.

Advertisement

Next Story