Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ.. 8 శాతం ప్రీమియంతో నమోదైన షేర్లు..!

by Maddikunta Saikiran |
Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ.. 8 శాతం ప్రీమియంతో నమోదైన షేర్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సంస్థ షేర్లు దలాల్ స్ట్రీట్లో ఈ రోజు లిస్ట్ అయ్యాయి. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను కంపెనీ గరిష్టంగా రూ. 390గా ఖరారు చేయగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి(NSE)లో 8 శాతం ప్రీమియంతో రూ. 420 వద్ద నమోదయ్యాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజి(BSE)లో 5.64 శాతం ప్రీమియంతో రూ. 412 వద్ద ప్రారంభమయ్యాయి. కాగా స్విగ్గీ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) నవంబర్ 8న ముగిసిన విషయం తెలిసిందే. స్విగ్గీ ఐపీఓకు తొలి రోజు అంతంత మాత్రమే స్పందన రాగా.. చివరి రోజు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో రూ. 11,300 కోట్ల ఐపీఓ మొత్తం 3.5 రేట్ల సబ్ స్క్రిప్షన్ అందుకుంది. మొత్తం 16 కోట్ల షేర్లకు 57.53 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కాగా ఈ రోజు మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో స్విగ్గీ షేర్లు 4.38 శాతం నష్టంతో రూ. 401 వద్ద ట్రేడవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed