Swiggy లో ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ. 2000 నోట్లు డెలివరీ.. కంగుతిన్న కస్టమర్లు

by Harish |   ( Updated:2023-02-22 07:12:01.0  )
Swiggy లో ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ. 2000 నోట్లు డెలివరీ.. కంగుతిన్న కస్టమర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్లు పార్శిల్ ఓపెన్ చేసి చూసేసరికి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పార్శల్‌లో రూ. 2000 నోట్లు దర్శనమిచ్చాయి. అలా షాక్ నుంచి తేరుకుని జాగ్రత్తగా గమనిస్తే అది నకిలీ రూ. 2000 నోటు అని తేలింది. అయితే స్విగ్గీ ఇదంతా కావాలనే చేసింది. ఎందుకంటే ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ 'ఫర్జీ' ప్రమోషన్ కోసం.

ప్రమోషన్‌లో భాగంగా తమ కస్టమర్లకు నకిలీ రూ. 2,000 నోట్లను పార్శిల్‌లో పంపించింది. ఈ వెబ్‌ సిరీస్ స్టోరీ మొత్తం కూడా రూ. 2,000 నకిలీ నోట్ల చుట్టూ తిరుగుతుంది. దీంతో వినూత్నంగా ప్రమోషన్ చేయాలని భావించి పార్శల్‌లో ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నకిలీ రూ. 2,000 నోట్లను పెట్టారు.


స్విగ్గీ పార్శిల్‌లో రూ. 2,000 నకిలీ నోట్లు వచ్చాయంటూ ఇప్పటికే కస్టమర్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, చెన్నై, గుర్గావ్, నోయిడా నగరాల్లో ఇలా రూ. 2,000 నకిలీ నోట్లు వచ్చాయి. అయితే ఈ నకిలీ నోట్లపై ఫర్జీ వెబ్ సిరీస్‌లో నటించిన విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ఫొటోలు ఉన్నాయి. అలాగే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిస్కౌంట్ కూపన్ కోడ్, ప్రైమ్ వీడియో లోగోలు కూడా ఉన్నాయి.




Advertisement

Next Story