- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త లైట్‌వెయిట్ ట్రాక్టర్లను విడుదల చేసిన స్వరాజ్ ట్రాక్టర్స్!
ముంబై: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ శుక్రవారం తన కొత్త కాంపాక్ట్ లైట్ వెయిట్ మోడళ్లను విడుదల చేసింది. 20-30 హెచ్‌పీ విభాగంలో టార్గెట్ 630, టార్గెట్ 625 పేర్లతో విడుదల చేసిన ట్రాక్టర్లను రూ. 5.35 లక్షల(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్వరాజ్ టార్గెట్ 630 మోడల్ ట్రాక్టర్లను కర్ణాటక, మహారాష్ట్ర మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, త్వరలో రెండవ మోడల్ టార్గెట్ 625ని డీలర్‌షిప్‌ల వద్ద ఉంచనున్నట్టు పేర్కొంది. కొత్త స్వరాజ్ టార్గెట్ మోడళ్లను అధునాతన టెక్నాలజీతో రూపొందించామని, స్ప్రేయింగ్ సహా వివిధ అవసరాలకు వినియోగించే సామర్థ్యం వీటికుంటుంది. వీటి ద్వారా ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక విలువైన పంటలను వేసుకునేందుకు వీలుగా తయారు చేశామని ఎంఅండ్ఎం స్వరాజ్ విభాగం సీఈఓ హరీష్ చవాన్ అన్నారు. కాగా, తాజా ఆటో అమ్మకాల గణాంకాల్లో స్వరాజ్ ట్రాక్టర్స్ మే నెలకు సంబంధించిన విక్రయాల్లో 4 శాతం క్షీణించింది. గతేడాది మేలో 35,722 యూనిట్లను విక్రయించిన కంపెనీ గత నెలలో 34,126 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇక, మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు కూడా 3 శాతం క్షీణించాయి.
Also Read..
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే!