- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుజుకి బైకులు కొనేందుకు ఫైనాన్స్ ఇవ్వనున్న ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వినియోగదారులకు తన బైకుల కొనుగోలులో ఫైనాన్స్ సౌకర్యాలు అందించేందుకు ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ కోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. దీనికోసం ఇరు కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నట్టు సుజుకి ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 'భారత మార్కెట్లో తమ బైకులకు ఆదరణ పెరుగుతోంది. సుజుకి ద్విచక్ర వాహనాలను సులభరీతిలో కొనుగోలు చేసేందుకు వినియోగదారుల కోసం ఫైనాన్స్ సదుపాయాలను అందించడం అవసరమని భావించాం. అన్ని రకాలుగా సులభమైన పద్ధతిలో రిటైల్ ఫైనాన్స్ సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని 'సుజుకి మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెద చెప్పారు. ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ కంపెనీతో కలిసి దేశీయంగా పెరుగుతున్న తమ వినియోగదారుల అవసరాలను తీర్చడమే కాకుండా వృద్ధి సామర్థ్యానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు సంస్థల ఒప్పందం ప్రకారం, సుజుకి బైకులను కొనాలనుకునే వినియోగదారులకు 24 గంటల్లో రిటైల్ ఫైనాన్స్ సౌకర్యం లభిస్తుంది. అలాగే, నిమిషాల వ్యవధిలో వాహన రుణం మంజూరు అవుతుంది. ఇబ్బందుల్లేని డాక్యుమెంటేషన్ ప్రక్రియ ద్వారా వినియోగదారులకే కాకుండా ఇరు కంపెనీలకు ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ భావిస్తోంది.