- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ గ్రూప్‌పై ఆరోపణల దర్యాప్తునకు సెబీకి గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు పొడిగింపును మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పార్దివాలాతో కూడిన ధర్మాసనం నిరవధిక పొడిగింపు ఇవ్వలేమని పేర్కొంది.
ఇదివరకు మే 2 లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆరు నెలల పొడిగింపును అడిగింది. ఇప్పటికే రెండు నెలల గడువు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఆగస్టు వరకు పొడిగించాం. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో, కంపెనీ షేర్ల విలువ భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read..
ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న రిలయన్స్, అదానీ కంపెనీలు!