Stock Markets: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-15 11:03:02.0  )
Stock Markets: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్‌(Reliance), బజాజ్ ఫైనాన్స్(Bajaj Finance), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) షేర్లలో అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 82,101.86 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 82,072.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 152.93 పాయింట్ల నష్టంతో 81,820 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.04గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్,ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్

నష్టపోయిన షేర్లు : రిలయన్స్‌, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్

Next Story

Most Viewed