Aviation Industry: దేశీయ విమానాశ్రయల అభివృద్ధికి రూ. 14.3 లక్షల కోట్లు అవసరం

by S Gopi |
Aviation Industry: దేశీయ విమానాశ్రయల అభివృద్ధికి రూ. 14.3 లక్షల కోట్లు అవసరం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగం భవిష్యత్తులో పెరగబోయే రద్దీని భర్తీ చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్‌పీ గ్లోబల్ తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం.. ఇటీవల రికార్డు స్థాయిలో చేసిన విమానాల ఆర్డర్ల కోసం నిధులు సమకూర్చేందుకు, అధిక ప్రయాణీకుల రద్దీ కోసం, విమానాశ్రయాల సామర్థ్యం పెంచేందుకు భారత విమానయాన రంగానికి 2030 నాటికి 170 బిలియన్ డాలర్ల(రూ. 14.3 లక్షల కోట్లు) అవసరం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ 2030 నాటికి 30 కోట్లతో రెట్టింపు అవుతుందని ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రికార్డు స్థాయిలో 1,700 విమానాలను ఆర్డర్ చేశాయి. వీటికోసం సుమారు రూ. 12.6 లక్షల కోట్లు ఖర్చు అవనున్నాయి. అలాగే, సింగపూర్, దుబాయ్, దోహాల తరహాలో భారత్ అత్యుత్తమైన విమానాశ్రయాలను నిర్మించేందుకు, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించాలంటే రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed