- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హై సెక్యూరిటీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగడం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం ఘటనపై స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదన్నారు.
హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదన్నారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ సీఎంఓ, డీజీపీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు.