- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లు వరుసగా మూడోరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ (America Federal Reserve) వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో మన బెంచ్ మార్క్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అలాగే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ఇక సెన్సెక్స్(Sensex) ఉదయం 80,666.26 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లోకి వెళ్లినా.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 80,050.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 137 పాయింట్లు తగ్గి 24,198 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ముగిసిన షేర్లు: రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, సన్ ఫార్మా, ఐటీసీ, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా
నష్టాల్లో ముగిసిన షేర్లు: టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, JSW స్టీల్