Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు

by Maddikunta Saikiran |
Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) నిన్న లాభాల్లో ముగియగా నేడు మాత్రం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ ఆఖర్లో మదుపర్లు(Investors) షేర్లను సేల్ చేయడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మెటల్(Metal), పబ్లిక్ సెక్టార్(PS) షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మన బెంచ్ మార్క్ సూచీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 78,707.37 పాయింట్ల వద్ద లాభాల్లో స్టార్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 78,877.36 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 67.30 పాయింట్ల నష్టంతో 78,472.87 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 25.80 పాయింట్లు క్షీణించి 23,727.65 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 85.20 వద్ద అల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు: టాటా మోటార్స్, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీసీ

నష్టాల్లో ముగిసిన షేర్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్

Advertisement

Next Story

Most Viewed