75 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ

by S Gopi |
75 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పలు ఎఫ్‌డీఎలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లతో పాటు ఆపైన బల్క్ డిపాజిట్లపై కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అధికారిక ఎస్‌బీఐ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, 46-179 రోజుల మధ్య డిపాజిట్లకు 4.75 శాతం ఉన్న వడ్డీని 5.50 శాతానికి పెంచింది. సీనియర్ సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. 180-210 రోజుల కాలవ్యవధిపై వడ్డీని 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లకు 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ అమలవుతుంది. మిగిలిన కాలవ్యవధులపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed