Starlink: త్వరలోనే భారత్‌లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Starlink: త్వరలోనే భారత్‌లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk)కు చెందిన స్టార్‌లింక్(Starlink) శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు త్వరలోనే భారత్‌(India)లో ప్రారంభం కానునున్నట్లు తెలుస్తోంది. మన దేశంలోని టెలికాం నిబంధనలను(Telecom Rules)పాటించేందుకు స్టార్‌లింక్ అంగీకరించినట్లు సమాచారం. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు వేలం వేయకుండా స్పెక్ట్రమ్‌ను కేటాయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎలన్ మస్క్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

భారత్ లో కార్యకలాపాలు నిర్వహించాలంటే స్టార్‌లింక్ వంటి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు దేశంలో యూజర్ల డేటా మొత్తాన్ని స్టోర్ చేయాలి. దీనికి కేంద్రం నుండి లైసెన్స్(License) పొందాలి. కాగా స్టార్‌లింక్ లైసెన్స్ పొందాలంటే అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) మంగళవారం తెలిపారు. స్టార్‌లింక్ తో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ సదరు సంస్థలు గవర్నమెంట్ రూల్స్ కు కట్టుబడి ఉండాలి. మా ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. దానిని పాటించిన వారికి లైసెన్స్ లభిస్తుందని మంత్రి వెల్లడించారు.

Advertisement

Next Story