- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Satellite Internet: స్టార్‌లింక్ ఎంట్రీతో దేశీయ టెలికాం మార్కెట్లో 'కొత్త వార్'
దిశ, బిజినెస్ బ్యూరో: భారత టెలికాం రంగంలో మరో వార్ మొదలుకానుంది. దేశీయంగా ఇంటర్నెట్, టెలికాం మార్కెట్లోకి కొత్త కంపెనీ అడుగుపెట్టనుంది. అది కూడా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ కావడం మరింత ఆసక్తికరం. అత్యధిక జనాభా కలిగిన భారత మార్కెట్లో స్టార్‌లింక్ ప్రవేశం ఇంటర్నెట్ వినియోగదారులకు గేమ్ ఛేంజర్ కానుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థలతో స్టార్‌లింక్ పోటీ పడనుంది. అయితే, ధరల పరంగా స్టార్‌లింక్ జియో, ఎయిర్‌టెల్‌లతో పోటీ పడగలదా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో బ్రాడ్‌బ్యాండ్, వైఫై ఇంటర్నెట్ సేవలు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి. కాబట్టి అత్యధిక ఇంటర్నెట్ వినియోగం కలిగిన భారత మార్కెట్లో ఎలన్ మస్క్ పోటీ ఎదుర్కొనేందుకు దూకుడుగానే వ్యవహరించవచ్చని తెలుస్తోంది.
భూమికి సమీప కక్ష్యలో ఉపగ్రహాల సహాయంతో వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలను స్టార్‌లింక్ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలందించేందుకు లైసెన్స్ కోసం భద్రతా పరమైన అనుమతులను స్టార్‌లింక్ కోరుతోంది. దీనిపై అధికారులు షరతులకు లోబడి స్టార్‌లింక్‌కు త్వరలో అనుమతులు వస్తాయనే అంచనాలున్నాయి. కొన్నేళ్లుగా భారత మార్కెట్లలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. సాధారణ ప్రక్రియలో అనుమతులు కోరిన ఎలన్ మస్క్ తీరుకు వ్యతిరేకంగా దేశీయ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు స్పెక్ట్రమ్ వేలం కోరాయి. దీనిపై గత నెల శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కోసం స్పెక్ట్రమ్ వేలం ఉండదని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా, స్టార్‌లింక్‌కు అవసరమైన భద్రతా అనుమతులు వస్తాయని మంత్రి చెప్పారు. స్టార్‌లింక్ మొత్తం డేటాను స్థానికంగానే ప్రాసెస్, నిల్వ చేస్తుందని, కంపెనీ శాటిలైట్ సిగ్నల్స్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని సింధియా ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ నిబంధనలను కంపెనీ పాటిస్తే లైసెన్స్ లభిస్తుంది. ప్రభుత్వ ప్రక్రియను కంపెనీ గౌరవించడం తమకు సంతోషమేనని అన్నారు.
మస్క్ తక్కువ ధరకే ఇంటర్నెట్ ఇస్తారా..
దేశీయ అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రస్తుతం 1.4 కోట్ల కస్టమర్లతో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాగే జియోకు 50 కోట్ల మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఎయిర్‌టెల్‌కు సైతం 30 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే, ఇప్పటికే స్పెక్ట్రమ్ వేలం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తమకు శాటిలైట్ ఇంటర్నెట్‌ను సాధారణ అనుమతుల ద్వారా ఎలన్ మస్క్‌కు ఇస్తే కస్టమర్లను కోల్పోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిలయన్స్ సంస్థ తన జియో సేవలు ప్రారంభించిన సమయంలో మార్కెట్ వాటా కోసం కస్టమర్లకు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలందించింది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఎలన్ మస్క్ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో నెలకు 120 డాలర్ల(మన కరెన్సీలో దాదాపు రూ. 10,000)తో స్టార్‌లింక్ సేవలను అందిస్తున్న మస్క్, ఆఫ్రికాలో నెలకు కేవలం 10 డాలర్ల(రూ. 800)కే అందిస్తున్నారు.