తరచూ చెక్ చేస్తే నిజంగానే సిబిల్ స్కోర్ తగ్గుతుందా..?

by S Gopi |   ( Updated:2023-03-26 04:58:46.0  )
తరచూ చెక్ చేస్తే నిజంగానే సిబిల్ స్కోర్ తగ్గుతుందా..?
X

దిశ, వెబ్ డెస్క్: సిబిల్ స్కోర్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే దాన్ని బట్టే బ్యాంకులు లోన్లు గానీ, ఇతర బెన్ఫిట్స్ గానీ కస్టమర్లకు ఇస్తూ ఉంటుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇవ్వడానికి ముందుకు రారు. అయితే, ఈ విషయంలో అందుకే టెన్షన్ గురవుతుంటారు. అయితే, ఇంకొంతమందికి సిబిల్ స్కోర్ ను తరచూ చెక్ చేస్తే తగ్గుతుందా అనే డౌట్ కూడా వస్తది. అయితే, ఇందుకు సంబంధించి నిపుణులు చెప్పిన దాని ప్రకారం... సిబిల్ స్కోర్ చెక్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. అందులో మొదటి సాఫ్ట్ క్రెడిట్ ఎంక్వైరీ చేసినప్పుడు అంటే మీకు మీరే చెక్ చేసుకోవడం అంటే మొబైల్స్ లో యాప్ ల ద్వారా లేదా ఇతర విధంగా సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తే సిబిల్ స్కోర్ ఏ మాత్రం తగ్గదంటా. రెండోది ఏంటంటే హార్డ్ ఎంక్వైరీ అంటే లోన్ ఇచ్చే కంపెనీ చేసే ఎంక్వైరీనే హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీ అంటారని, ఓన్లీ ఇది చెక్ చేసినప్పుడు మాత్రమే టెంపరేరీగా సిబిల్ స్కోర్ తగ్గే అవకాశముంటదని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్ క్రెడిట్ ఎంక్వైరీలో ఏ మాత్రం సిబిల్ స్కోర్ తగ్గదని చెబుతున్నారు.

Read more:

ఒకే ఒక్క ఎస్ఎంఎస్ తో ఆధార్-పాన్ ను లింక్ చేసుకోండిలా..!

Advertisement

Next Story