త్వరలో రిలయన్స్ ఐస్‌క్రీం.. కొత్త బిజినెస్‌లోకి అంబానీ..!!

by sudharani |   ( Updated:2023-04-10 14:01:21.0  )
త్వరలో రిలయన్స్ ఐస్‌క్రీం.. కొత్త బిజినెస్‌లోకి అంబానీ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పెట్రోల్, ఎలక్ట్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ వంటి అనేక వ్యాపారాల్లో రాణిస్తున్న రిటైల్ దిగ్గజం రిలయన్స్ మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కూల్ డ్రింక్స్, సబ్బులు మొదలైన ఉత్పత్తులను విక్రయిస్తున్న రిలయన్స్ ఐస్‌క్రీం బ్రాండ్ ప్రారంభించాలని భావిస్తోందట. ఇందుకోసం ఓ గుజరాతీ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది గుజరాత్‌లో రిలయన్స్ ఈ బ్రాండ్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోందట. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ విషయంపై ఇంక ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఒకవేళ ఐస్‌క్రీం రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ ఇస్తే ఇక్కడి మార్కెట్‌లో తప్పక పోటీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ వేసవిలోనే రిలయన్స్ తన సొంత బ్రాండ్‌పై ఐస్‌క్రీంను అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉందంటూ సమాచారం.

Also Read..

స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!

Advertisement

Next Story