ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు చేసిన జీక్యూజీ పార్ట్‌నర్స్

by S Gopi |
ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు చేసిన జీక్యూజీ పార్ట్‌నర్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్రమోటర్ గ్రూప్ కంపెనీ సింగపూర్ టెలికమ్యూనికేషన్‌లో అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 0.8 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ. 1,193.70 చొప్పున మొత్తం 4.9 కోట్ల షేర్లను జీక్యూజీ పార్ట్‌నర్స్ సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు విలువ 710.81 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 5,886 కోట్లు. ఈ లావాదేవీ అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ వాటా 29.8 శాతం నుంచి 29 శాతానికి తగ్గింది. 2022 నుంచి ఇప్పటివరకు సింగ్‌టెల్ సంస్థ ఎయిర్‌టెల్‌లో 3.3 శాతం వాటాను విక్రయించింది. డేటా సెంటర్, ఐటీ సేవల కోసం నిధులను సమకూర్చడంతో పాటు అప్పులు తగ్గించుకునేందుకు ఎయిర్‌టెల్‌లో వాటాను విక్రయించినట్టు సింగ్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Next Story