ఒక్క చార్జింగ్‌తో 236 కి.మీ ప్రయాణించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

by Harish |
ఒక్క చార్జింగ్‌తో 236 కి.మీ ప్రయాణించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రానుంది. ఇది ఒక్కసారి చార్జింగ్‌తో 236 కి.మీ లు ప్రయాణిస్తుంది. స్కూటర్ 4.8 kWh Li-ion బ్యాటరీతో పాటు 8.5 kW ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్‌పి పవర్, 72NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 0-40 కి.మీ వేగాన్ని కేవలం 2.77 సెకన్లలో అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అలాగే, దీని గరిష్ట వేగం గంటకు 105 కి.మీ. చార్జింగ్ పరంగా బ్యాటరీ కేవలం 3 గంటల్లో 80 శాతం చార్జ్ అవుతుంది.


దీనిలో రిమోట్ లాకింగ్, రైడ్ వివరాలు, సింపుల్ వన్ యాప్ కనెక్టివిటీ, ముందు LED లైటింగ్, డిస్క్ బ్రేకులు, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్ వంటి మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మే 23న ఇది అమ్మకానికి రానుంది. దీని ధర రూ. 1.2 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వినియోగదారులు రూ. 1947 చెల్లించి ముందస్తు బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ బ్రాజెన్ బ్లాక్, నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్ రంగులలో అందించబడుతుంది. బ్యాటరీ, చార్జర్‌పై 3 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.

Advertisement

Next Story