జూన్ త్రైమాసికంలో 15.5% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

by Harish |
జూన్ త్రైమాసికంలో 15.5% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఆటోమొబైల్ ఎగుమతులు సంవత్సరానికి 15.5 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) డేటా పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో 10,32,449 యూనిట్ల నుంచి మొత్తం షిప్‌మెంట్లు 11,92,577 యూనిట్లకు పెరిగాయి. వీటిలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 19 శాతం పెరిగాయి, ఇవి గత ఏడాది 1,52,156 యూనిట్లుగా కాగా, ఈ త్రైమాసిక కాలంలో 1,80,483 యూనిట్లకు చేరుకున్నాయి.

ముఖ్యంగా ప్రయాణికుల వాహనాల ఎగుమతుల్లో మారుతీ సుజుకి ఇండియా అగ్రభాగంలో ఉంది. మొత్తం 69,962 వాహనాలను ఎగుమతి చేయగా, ఇది గత ఏడాది 62,857 గా నమోదైంది. తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా 35,100 నుంచి పెరిగి 42,600 యూనిట్లను ఎగుమతి చేసింది. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, వీటి ఎగుమతులు 17 శాతం వృద్ధిని సాధించాయి. సమీక్షా కాలంలో ఇవి 9,23,148 ఎగుమతులు జరిగాయి, గత ఏడాది ఈ సంఖ్య 7,91,316 లుగా ఉంది.

అదే త్రీ-వీలర్ ఎగుమతులు 3 శాతం క్షీణించాయి. ఇవి గత ఏడాది 73,360 యూనిట్లుగా, కాగా ఇప్పుడు 71,281కు తగ్గాయి. వాణిజ్య వాహనాల ఎగుమతులు సంవత్సరానికి 8 శాతం వృద్ధి చెందాయి, గత సంవత్సరం 14,625 యూనిట్లతో పోలిస్తే 15,741 యూనిట్ల ఎగుమతులు జరిగాయి. సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, బలమైన ఆర్థిక వ్యవస్థ, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో రానున్న రోజుల్లో భారత్ నుంచి బలమైన ఎగుమతులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed