PhonePe, Google Pay యూజర్లకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కొత్త మోసం!

by Harish |   ( Updated:2023-03-19 06:57:23.0  )
PhonePe, Google Pay యూజర్లకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కొత్త మోసం!
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెరుగుతున్న కొద్ది ఆన్‌లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే మాధ్యమాలే లక్ష్యంగా హ్యాకర్స్ ఎక్కువగా దాడి చేసి వినియోగదారుల డబ్బులు దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ లావాదేవీల పరంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిపై హ్యాకర్స్ ఎక్కువగా దాడి చేయాలని చూస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికోసం కొత్త తరహా మోసాలకు హ్యాకర్స్ పాల్పడుతున్నట్లు ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు ఇటీవల తెలిపారు.


మోసగాళ్లు ఫోన్ పే/ గూగుల్ పే ద్వారా ఇతరులకు డబ్బులు పంపించి, తరువాత కాల్ చేసి పొరపాటుగా మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి. వాటిని తిరిగి పంపించమని కోరతారు. దీంతో అవతలి వారు తిరిగి డబ్బులు పంపిచాక వారి అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తున్నారని అని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మోసగాళ్లు పెద్ద మొత్తంలో కాకుండా రూ.20 నుంచి మొదలుకుని రూ.100 వరకు పంపిస్తారు.


ఇలా డబ్బులు తిరిగి పంపించినప్పుడు హ్యాకర్స్ ఒక మాల్వేర్‌ను పంపించి ఫోన్‌ను హ్యాకింగ్ చేసి అకౌంట్లో ఉన్న మొత్తం అమౌంట్‌ను దోచుకుంటున్నట్లు వారు తెలిపారు. రాను రాను కొత్త తరహా మోసాలు పెరుగుతున్న కారణంగా ప్రజలు తమ ట్రాన్సక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు వివరాలు, పాన్, ఆధార్ వివరాలు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Advertisement

Next Story