- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్.. భారీగా పెంచిన రుణ రేట్లు
దిశ, వెబ్‌డెస్క్: గృహ, వాహన, వ్యక్తిగత ఇతర అంశాలపై బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటారు. అతి తక్కువ వడ్డీ పడుతుందనే నెపంలో బ్యాంకులు నుంచి రుణాలు తీసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తారు. అయితే ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. రుణ రేట్లను పెంచుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్లు పెంచేసింది.
దీని కారణంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహితలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. అన్ని కాల పరిమితులకు సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. పెంపు అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్ఆర్ (MCLR)లు ఇప్పుడు 7.5% - 8.05% మధ్య ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.85%గా ఉంది. కాగా.. పెరిగిన రుణ రేట్లు మే-8 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి
Also Read..