RBI: ద్రవ్యోల్బణంపై ఆధారపడే వడ్డీ రేట్ల తగ్గింపు: శక్తికాంత దాస్

by Harish |
RBI: ద్రవ్యోల్బణంపై ఆధారపడే వడ్డీ రేట్ల తగ్గింపు: శక్తికాంత దాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వడ్డీ రేట్ల తగ్గింపు అనేది ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అనేది భవిష్యత్ డేటాపై ఆధారపడి ఉంటుంది, రేట్లను తగ్గించకపోవడం వల్ల భారత వృద్ధిపై ప్రతికూల ప్రభావం అతి తక్కువ అని అన్నారు. ఈ సందర్భంగా ద్రవ్యోల్బణం గురించి వ్యాఖ్యానిస్తూ, ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ ఎప్పుడూ చెప్పలేదు, దానికి సమానంగా ఉండేలా చూడాలని, కొంత ఓపిక పట్టినట్లయితే ఇది మరింత తగ్గుతుందని దాస్ చెప్పారు.

భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఆ రేటు 7.2 శాతంగా ఉంది. ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతానికి, ద్రవ్యోల్బణం తగ్గుతోందని విశ్వసిస్తున్నాము. 4.5 శాతంగా ఉంది, ఇది దాదాపు 4 శాతంగా నమోదవుతుందని ఆశిస్తున్నట్లు దాస్ తెలిపారు. దేశ అభివృద్ధిపై ద్రవ్యోల్బణం అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధి చెక్కుచెదరకుండా, స్థిరంగా, స్థితిస్థాపకంగా ఉంది, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. రాబోయే రోజుల్లో దీని డేటాను పూర్తిగా పరిశీలన చేసిన తరువాతే వడ్డీ రేట్లపై ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని దాస్ అన్నారు.

Advertisement

Next Story