300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

by S Gopi |
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు నమోదయ్యాయి. గత రెండు సెషన్లలో బలహీనపడిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో మెరుగైన లాభాలతో పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినప్పటికీ భారత్‌తో పాటు అమెరికా, యూరప్ దేశాల కీలక గణాంకాల వెల్లడి నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ బలంగా మారింది. వీటికి తోడు కీలక ఐటీ, ఆటో, రియల్టీ రంగాల్లో కొనుగోళ్లు జోరు సూచీలకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 305.09 పాయింట్లు లాభపడి 73,095 వద్ద, నిఫ్టీ 76.30 పాయింట్ల లాభంతో 22,198 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఐటీ, ఆటో, ఫార్మా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, సన్‌దార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.85 వద్ద ఉంది.

Advertisement

Next Story