వరుసగా మూడోరోజూ నష్టాలే!

by Harish |   ( Updated:2023-04-19 13:33:04.0  )
వరుసగా మూడోరోజూ నష్టాలే!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గత వారం దూకుడుగా ర్యాలీ చేసిన సూచీలు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా వరుసగా మూడో రోజు పతనమయ్యాయి. దేశీయంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం, బలహీనమైన విదేశీ పెట్టుబడిదారుల ధోరణి కారణంగా బుధవారం ట్రేడింగ్‌లో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 159.21 పాయింట్లు నష్టపోయి 59,567 వద్ద, నిఫ్టీ 41.40 పాయింట్లు కోల్పోయి 17,618 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, విప్రో, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.24 వద్ద ఉంది.

Also Read...

బిజినెస్ ఐడియా: ATM ఫ్రాంచైజీతో నెలకు రూ. 70 వేల సంపాదన

Advertisement

Next Story

Most Viewed