- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మళ్లీ 72 వేల పైకి సెన్సెక్స్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మంగళవారం ఉదయం నుంచే లాభాల బాట పట్టాయి. రోజంతా అదే ధోరణిలో సాగిన ర్యాలీ ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహానికి తోడు ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లతో లాభల పంట పండించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.67 పాయింట్లు లాభపడి 72,186 వద్ద, నిఫ్టీ 157.70 పాయింట్లు పెరిగి 21,929 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకి, టీసీఎస్, విప్రో, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టె కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.05 వద్ద ఉంది.