మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు ఉన్నప్పటికీ దేశీయంగా సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరడం, కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా రోజంతా ఒడిదుడుకులు కొనసాగాయి. మిడ్-సెషన్ తర్వాత మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలు పెరిగాయి. ప్రధానంగా రిలయన్స్, ఎయిర్‌టెల్‌తో పాటు బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, ఐటీ, మెటల్ రంగాల్లో లాభాల స్వీకరణ నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 220.05 పాయింట్లు నష్టపోయి 75,170 వద్ద, నిఫ్టీ 44.30 పాయింట్ల నష్టంతో 22,888 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ స్టాక్స్‌లో నష్టాలు నమోదయ్యాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.18 వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్లలో పెరిగిన నష్టాల కారణంగా మంగళవారం ట్రేడింగ్‌లో మదుపర్లు ఒక్కరోజే రూ. 3.08 లక్షల కోట్లు కోల్పోవడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.416.87 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed