- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కువ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస సెషన్లలో లాభాలు కొనసాగిస్తున్నాయి. అంతకుముందు ట్రేడింగ్‌లో మెరుగైన ర్యాలీ చూసిన సూచీలు మంగళవారం తక్కువ లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ కీలక రంగాల్లో అమ్మకాల కారణంగా మార్కెట్లు ఎక్కువ లాభాలను సాధించలేకపోయాయి. అయినప్పటికీ మదుపర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో సానుకూల ర్యాలీ కొనసాగింది. ప్రధానంగా రియల్టీ రంగం షేర్లలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లను కొనసాగించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 89.83 పాయింట్లు లాభపడి 73,738 వద్ద, నిఫ్టీ 31.60 పాయింట్ల లాభంతో 22,368 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. సన్‌ఫార్మా, రిలయన్స్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.33 వద్ద ఉంది.