Stock Market: స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ ఎఫెక్ట్

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా అస్థిరంగా కదలాడిన సూచీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన పలు ప్రకటనలతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బడ్జెట్ సమర్పణకు ముందు కొద్దిసేపు లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఆ తర్వాత లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్‌పై పన్నును 12.5 శాతానికి, షార్ట్ టర్మ్ గెయిన్స్‌పై 20 శాతానికి పెంచడం, సెక్యూరిటీ ట్రాన్సాక్సన్ పన్నును కొంతమేర పెంచేందుకు ప్రతిపాదించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పడంతో మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఓ దశలో కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,500 పతనమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు, ఎంఎస్ఎంఈలు, ఇంకా ఇతర ప్రధాన రంగాలకు కేటాయింపులు పెంచడంతో నష్టాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 73.04 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద, 30.20 పాయింట్లు క్షీణించి 24,479 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను సాధించాయి. ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారస్టాక్ కం విలువ రూ. 83.69 వద్ద ఉంది.



Next Story