సెన్సెక్స్ @75,000

by S Gopi |
సెన్సెక్స్ @75,000
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డుల దిశగా ర్యాలీ అవుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే సూచీలు చారిత్రాత్మక గరిష్ఠాలను సాధ్సితున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 75,000 మైలురాయిని చేరింది. నిఫ్టీ సైతం 22,768 ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే, దేశీయంగా మార్చి త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలవడం, గ్లోబల్ మారెక్ట్లలో ముడిచమురు ధరలు పెరగడంతో మార్కెట్లు చివర్లో బలహీనపడ్డాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కారణంగా నీరసించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 58.80 పాయింట్లు పడిపోయి 74,683 వద్ద, నిఫ్టీ 23.55 పాయింట్లు క్షీణించి 22,642 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, రియల్టీ, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టైటాన్, రిలయన్స్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.21 వద్ద ఉంది.

అంతర్జాతీయ పరిణామాలను పక్కనబెట్టి సెన్సెక్స్ ఇండెక్స్ గడిచిన నెల రోజుల్లోనే 1,000 పాయింట్లు ర్యాలీ చేయడం విశేషం. మంగళవారం కీలక 75,000 మార్కును దాటింది. మార్చి 6న 74,000కు చేరిన తర్వాత దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో మార్కెట్లు ఉత్సాహంగా పుంజుకున్నాయి.

సెన్సెక్స్ మైలురాళ్లు..

మైలురాయి తేదీ

1,000 జూలై 25, 1990

5,౦౦౦ అక్టోబర్ 11, 1999

10,000 ఫిబ్రవరి 7, 2006

20,000 డిసెంబరు 11, 2007

30,000 ఏప్రిల్‌ 26, 2017

40,000 జూన్‌ 3, 2019

50,000 ఫిబ్రవరి 3, 2021

60,000 సెప్టెంబరు 24, 2021

70,000 డిసెంబరు 11, 2023

71,000 డిసెంబర్ 15,2023

71,000 డిసెంబర్ 15,2023

72,000 డిసెంబర్ 27, 2023

73,000 జనవరి 15, 2024

74,000 మార్చి 06, 2024

75,000 ఏప్రిల్ 09, 2024

Advertisement

Next Story

Most Viewed