- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి మెరుగైన లాభాల్లో కదాలాడిన సూచీలు చివరి అరగంటలో బలహీనపడ్డాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయ ఫార్మా రంగంలోని షేర్లలో విపరీతమైన అమ్మకాల కారణంగా సూచీలు నీరసించాయి. దీనికి తోడు వీక్లీ ఎఫ్ అండ్ ఓ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడ్డారు. రోజంతా సానుకూలంగా కదలాడిన స్టాక్ మార్కెట్లు ఆఖర్లో బలహీనపడ్డాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 35.68 పాయింట్లు పడిపోయి 61,904 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్లు తగ్గి 18,297 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు 1 శాతానికి పైగా క్షీణించాయి. మిగిలిన రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎల్అండ్‌టీ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.09 వద్ద ఉంది.