- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IT: అమ్మకానికి భారత్‌లోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్‌పక్కంలోని ఐటీ కారిడార్‌లో 15 ఎకరాల విస్తిర్ణంలో, నాలుగు లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ను విక్రయించడానికి సిద్ధమైంది. ఈ అమ్మకం ద్వారా కంపెనీకి దాదాపు రూ.750-800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీనిని గత 20 ఏళ్లుగా కాగ్నిజెంట్ తన ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తోంది. ఈ ఆఫీస్‌ను డిసెంబర్ నాటికి ఖాళీ చేసే అవకాశం ఉందని సమాచారం. తరువాత కంపెనీ జీఎస్టీ రోడ్‌లోని తాంబరం సమీపంలోని MEPZ క్యాంపస్‌ను దాని ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చని తెలుస్తుంది.
కాగ్నిజెంట్ ఈ ఆఫీస్ అమ్మకపు బాధ్యతలను అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజరీ జేఎల్‌ఎల్‌కు సంస్థకు అప్పగించింది. ఇది ఇప్పటికే భాష్యం గ్రూప్, కాసగ్రాండ్ సంస్థలతో చర్చలు జరుపుతుంది. సంస్థ తన కార్యకలాపాలను ఎంఈపీజెడ్, షోలింగనల్లూర్, సిరుసేరిలోని మూడు స్వంత భవనాలలో ఏకీకృతం చేయాలని చూస్తుంది, దీని ద్వారా చెన్నైలో లీజుకు తీసుకున్న స్థలాలను వదులుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కొన్ని లీజు స్థలాలలో రామానుజన్ ఐటీ పార్క్, డీఎల్‌ఎఫ్, RA పురంలోని సెయింట్ మేరీస్ రోడ్ కార్యాలయాలను వదులుకుంది.