అదానీ కంపెనీల రుణాల రేటింగ్ సమాచారాన్ని కోరిన సెబీ!

by Vinod kumar |
అదానీ కంపెనీల రుణాల రేటింగ్ సమాచారాన్ని కోరిన సెబీ!
X

ముంబై: అదానీ గ్రూప్ వ్యవహారానికి సంబంధించి హిండెన్‌బర్గ్ ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సెబీ ఇప్పటికే ద్రర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ కంపెనీలు తీసుకున్న స్థానిక రుణాలు, జారీ చేసిన సెక్యూరిటీలపై రేటింగ్స్ వివరాలు ఇవ్వాలని దేశీయ క్రెడిట్ సంస్థలను సెబీ ఆదేశించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. దీన్ని సరిదిద్దేందుకు అదానీ గ్రూప్ ముందుగా రుణాలను చెల్లించడం ప్రారంభించింది.

ఈ క్రమంలోనే సెబీ రుణాలపై రేటింగ్ వివరాలివాలని తెలియజేసింది. ఇదే సమయంలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ బుధవారం ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌తో పాటు ఆదిత్య బిర్లా సన్‌లై మ్యూచువల్ ఫండ్‌లకు చెందిన రూ. 1,500 కోట్ల రుణాలను చెల్లించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కంపెనీకి వికీపీడియా కొత్త ఆరోపణ, సెబీ ప్రకటన వల్ల బుధవారం అదానీ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ. 51 వేల కోట్లకు పైగా పతనమైంది. దీంతో మొత్తంగా కంపెనీ మార్కెట్ విలువ 60 శాతానికి పైగా అంటే రూ. 11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

Advertisement

Next Story