- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్‌సెక్యూర్‌డ్ రిటైల్ రుణాలను తగ్గించిన ఎస్‌బీఐ
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అన్‌సెక్యూర్‌డ్ రిటైల్ రుణాలను తగ్గించినట్టు దాని ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. కార్పొరేట్ల నుంచి స్థిరమైన డిమాండ్ ఉన్నప్పటికీ మొత్తం రుణ వృద్ధిని 15 శాతం వద్ద స్థిరంగా ఉంచేందుకు, సురక్షితమైన వృద్ధిపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. గత కొంతకాలంగా అన్‌సెక్యూర్‌డ్ రిటైల్ రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 30-33 శాతం మేర ఉన్న వృద్ధి వేగాన్ని మెరుగైన వ్యూహంతో 18 శాతానికి తగ్గించామన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఈ వృద్ధి సహేతుకమని ఆశిస్తున్నాం. అనూహ్యమైన వృద్ధిని తాము ఆశించట్లేదని దినేష్ ఖారా వివరించారు. గత నెల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అన్‌సెక్యూర్‌డ్ రిటైల్ రుణాల భారాన్ని తగ్గించేందుకు రిస్క్ వెయిట్‌ను 100 శాతం నుంచి 125 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకులు వృద్ధి చెందడం మంచిదే, కానీ అనూహ్యంగా పెరగడం ఎప్పటికైనా ప్రమాదమేనని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, బ్యాంకులు ఆరోగ్యక్రమైన వృద్ధి సాధించేలా చూడాలని చెప్పినట్టు ఆయన వెల్లడించారు.