ఎస్‌బీఐ సరికొత్త స్కీమ్.. చేతికి రూ. 32 లక్షలు అందించే డిపాజిట్ పథకం

by Harish |   ( Updated:2023-03-02 13:16:15.0  )
ఎస్‌బీఐ సరికొత్త స్కీమ్.. చేతికి రూ. 32 లక్షలు అందించే డిపాజిట్ పథకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వరుసగా రెపోరేటు పెరుగుదలతో బ్యాంకులు క్రమంగా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే వినియోగదారుల ప్రయోజనాల కోసం ఎస్‌బీఐ కొత్తగా సర్వోత్తం పేరుతో టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది. సర్వోత్తం డిపాజిట్‌లో రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది నాన్ క్యాలబుల్, రెండోది క్యాలబుల్. దీనిలో నాన్ క్యాలబుల్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.


ఎస్‌బీఐ సర్వోత్తం డిపాజిట్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్స్‌కు గరిష్ఠంగా 7.9 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. అదే సాధారణ ఖాతాదారులకు అయితే వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఒక ఏడాది కాల పరిమితి పై సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంటుంది. సాధారణ ఖాతాదారులకు 7.1 శాతంగా ఉంది. అలాగే, ఎస్‌బీఐ ప్రత్యేకంగా అమృత్ కలాష్ అనే డిపాజిట్ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్‌పై సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీ వస్తోంది. రెగ్యులర్ ఖాతాదారులకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.


ఎస్‌బీఐ సర్వోత్తం పథకంలో కనీసం రూ. 15 లక్షలకు పైగా డిపాజిట్ చేయాలి. పదేళ్లలో మొత్తం అమౌంట్ రూ. 32 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ కాల పరిమితి 2 ఏళ్ల వరకే ఉంటుంది. కానీ, తర్వాత దీనిని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్కీమ్‌లలో పోస్టాఫీస్ వడ్డీ రేటు 7.1 శాతం, ఎన్‌ఎస్‌సీ 7 శాతం, కిసాన్ వికాస్ పత్ర 7.2 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతంగా ఉంది. వీటితో పోలిస్తే ఎస్‌బీఐ సర్వోత్తం మరింత ఎక్కువగా రాబడి ఇస్తోంది.




Advertisement

Next Story

Most Viewed